శృతి హాసన్ పేస్ మాస్క్ చూశారా ?

  • In Film
  • July 13, 2020
  • 183 Views
శృతి హాసన్ పేస్ మాస్క్ చూశారా ?

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా భయం గుప్పిట్లో చిక్కుకొన్నది. కరోనావైరస్ బారిన పడకుండా ఎవరికి వారు తమకు తోచిన విధంగా ముఖాన్ని కప్పేసుకొంటున్నారు. కర్ఛిఫ్స్, క్లాత్‌తో స్వంతంగా మాస్క్‌లు చేసుకొని ప్రాణాంతక వ్యాధి బారి నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మాస్క్ అవసరాన్ని చెబుతూ అందంగా ఉండే మాస్క్‌ను తయారు చేసి శృతి హాసన్ ఆకట్టుకొన్నారు.తాను స్వయంగా డిజైన్ చేసుకొన్న మాస్క్‌ను ఆకట్టుకొనే విధంగా నల్లటి వస్త్రంతో తయారు చేశారు. దానికి సీతాకోక చిలుకల బొమ్మలు కుట్టి మరింత ఆకర్షణీయంగా చేశారు. ఆ మాస్క్‌ను ధరించి సెల్ఫీకి ఫోజిచ్చారు. ఆ ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేయగా మంచి స్పందన కనిపించింది.తన మాస్క్‌ గురించి క్రేజీగా శృతిహాసన్ ఇన్స్‌టాలో కామెంట్ పెట్టారు. మాస్క్‌పై సీతాకోక చిలుకలు ఎందుకు పెట్టానంటే అంటూ వివరణ ఇచ్చారు. అందంగా కనిపించడానికి నా మాస్క్‌కు అలాంటివి అవసరం అంటూ కామెంట్ చేసి సీతాకోక చిలుక బోమ్మలు, లవ్ సింబల్స్‌ ఇమోజీలతో కామెంట్ చేశారు. ఈ పోస్టుకు 1.6 లక్షల మంది లైక్ చేయగా, సుమారు 700 మంది కామెంట్స్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos