300 కోడిగుడ్లతో యాంకర్ శ్రావ్యా రెడ్డి బాత్‌టబ్‌ ఛాలెంజ్..

  • In Film
  • March 18, 2019
  • 184 Views
300 కోడిగుడ్లతో యాంకర్ శ్రావ్యా రెడ్డి బాత్‌టబ్‌ ఛాలెంజ్..

బియర్‌తో బాత్‌టబ్‌ ఛాలెంజ్‌తో యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన తెలుగు హాట్‌ యాంకర్‌,మోడల్‌ శ్రావ్యరెడ్డి మరోసారి అదే తరహా  ఛాలెంజ్‌తో అభిమానులను అలరించడానికి ఎగ్‌ ఛాలెంజ్‌ వీడియో పోస్ట్‌ చేసింది.ఇదివరకు తాను చేసిన ఐస్‌ ఛాలెంజ్‌,బియర్‌ ఛాలెంజ్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన లభించడంతో ఈసారి తన సోదరి విదా చైతన్యతో కలసి కోడిగుడ్లతో బాత్‌టబ్‌ ఛాలెంజ్‌ చేసి వీడియో వదిలింది.అయితే ఈ వీడియోపై సాధారణ ప్రజలతో పాటు అభిమానులు కూడా రివర్స్‌ అయ్యి శ్రావ్యరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కోడిగుడ్లతో బాత్‌టబ్‌ ఛాలెంజ్‌ కోసం 300 కోడిగుడ్లు వృథా చేయడంపై అభిమానులు సైతం శ్రావ్యరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అదే కోడిగుడ్లను ఏదైనా అనాథశ్రమానికో లేదా పేదలకు పంపిణీ చేసి ఉంటే బాగుండేదని కానీ ఛాలెంజ్‌ పేరుతో ఆహార పదార్థాలను నేలపాలు చేశారంటూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.మరొకసారి ఇటువంటి పిచ్చిపిచ్చి ఛాలెంజ్‌లు చేస్తే మీపై కేసు పెడతామని, అవరసమైతే కోర్టుకు సైతం వెళతామంటూ హెచ్చరించారు. మరి కొంతమంది ఛాలెంజ్‌లు చేయాలంటే బాగా మరిగిన వేడినీళ్లలో బాత్‌టబ్‌ చేయండంటూ విమర్శలు చేస్తున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos