బ్యాడ్మింటన్
క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితంపై తెరకెక్కుతున్న బయోపిక్ నుంచి శ్రద్ధా కపూర్
తప్పుకోవడం బాలీవుడ్ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.సైనా బయోపిక్ కోసం శ్రద్ధాను
ఎంచుకున్నపటి నుంచి శ్రద్ధాకు బ్యాడ్మింటన్ శిక్షణతో పాటు సైనా బాడీ లాంగ్వేజ్ కోసం
అనేక వర్క్‌షాప్‌లు కూడా నిర్వహించారు.బయోపిక్‌కు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్‌లుక్
పోస్టర్‌కు కూడా మంచి స్పందన దక్కింది.ఇంత జరిగిన అనంతరం శ్రద్ధా ఉన్నట్లుండి ప్రాజెక్ట్
నుంచి తప్పుకోవడంతో బాలీవుడ్‌లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.ప్రాజెక్ట్ నుంచి శ్రద్ధా
తప్పుకోవడంపై నిర్మాత భూషన్ కుమార్ మాట్లాడుతూ..ఈ ఏడాది చివరికి చిత్రీకరణ పూర్తి
చేసి వచ్చే ఏడాదిలో చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నామని అయితే చిత్రీకరణ ఆలస్యం కావడం,ఇతర
చిత్రాలతో శ్రద్ధా డేట్స్ క్లాష్ అవుతుండడంతో పరస్పర అంగీకారంతోనే శ్రద్ధా చిత్రం
నుంచి తప్పుకుందని తెలిపారు.శ్రద్ధా స్థానంలో పరిణితి చోప్రా సైనా నెహ్వాల్ బయోపిక్‌లో
నటించనుందన్నారు..