ఢిల్లీలో రాష్ట్రపతి పాలన పెట్టండి

ఢిల్లీలో రాష్ట్రపతి పాలన పెట్టండి

న్యూ ఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా పరిస్థితి అదుపు తప్పింది. ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా. వెంటనే రాష్ట్రపతి పాలన అమలు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే షోయబ్ ఇక్భాల్ అన్నారు. ‘ఢిల్లీలో పరిస్థితులు చూస్తుంటే ఏడుపొస్తోంది. నా గుండె తరుక్కుపోతోంది. కరోనా ఔషధాలు, ఆక్సిజన్ రోగులకు దొరకడం లేదు. నా మిత్రుడూ దాని బారిన పడి పోరాడుతున్నాడు. అతడికి ఆమ్లజని చాలా అవసరం. కానీ అదీ, వెంటిలేటర్ అందుబాటులో లేవు. రెమ్డెసివిర్ మందులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో కూడా అర్థం కావట్లేద’ని ఇక్బాల్ ఒక వీడియో సందేశంలో ఆక్రోశించారు. ‘ఈ పరిస్థితులను చూసి తాను ఎమ్మెల్యేగా గర్వపడే కన్నా సిగ్గుతో తలదించుకుంటున్నా. ఎమ్మెల్యేగా ఉండి కూడా ఒకరికి సాయం చేయలేకపోతున్నా. ప్రభుత్వమూ ఎలాంటి సాయం చేయట్లేదు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఒక్కరూ, ఒక్క సారైనా నా మాటను పట్టించుకోలేదు. ఏ ఒక్క అధికారినీ కలవలేకపోతున్నా. కాబట్టి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందిగా ఢిల్లీ హైకోర్టును కోరుతున్నాన’ని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos