భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ప్రయోగించిన చంద్రయాన్ 2 ప్రయోగంతో ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూశాయి.అయితే ప్రయోగంలో కీలకఘట్టమైన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపే సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విక్రమ్ ల్యాండర్తో సంబంధాలు తెగిపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు ఇతర దేశాల శాస్త్రవేత్తలు సైతం నిరాశ చెందారు.అయితే పాకిస్థాన్ దేశ మంత్రి ఫవాద్ చౌదరి మాత్రం ఇస్రో చంద్రయాన్ 2 ప్రయోగంపై నోటి దురుసు వ్యాఖ్యలు చేసి తన అక్కసు,దుర్బుద్ధి బయటపెట్టుకున్నాడు.చేతకాకపోతే ఊరికే కూర్చొవాలిగాని ఇలా చేయడం ఎందుకని, భారత్ వంటి పేదదేశం రూ. 1000 కోట్ల రూపాయలను చంద్రయాన్ పేరుతో తగలేసిందని ట్విట్టర్లో అవాకులు చవాకులు పేలాడు.దీంతో నెటిజన్లు ఫవాద్పై విరుచుకుపడ్డారు.అయితే పాకిస్థానీలు సైతం ఫవాద్పై మండిపడుతుండడం చర్చనీయాంశమైంది.కొందరు పాకిస్తానీలు చంద్రయాన్-2 ప్రయోగం పై, పాకిస్తానీ మంత్రి చేసిన వ్యాఖ్యలపై భారతీయులకు క్షమాపణలు చెబుతున్నారు.పాకిస్తానీలుగా మేమంతా సిగ్గుపడుతున్నామని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఫవాద్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై అసహనంగా ఉన్నామని చెప్తున్నారు.చంద్రయాన్ 2 ప్రయోగం చాలా గొప్పదని ఇది భారత్ సాధించిన విజయమని దీన్ని చూసి పాకిస్థాన్ ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలని చురకలంటిస్తున్నారు.అంతరిక్ష పరిశోధనలో దశాబ్దాల వెనుకుబాటు తనంలో ఉన్న పాకిస్థాన్ భారత్ను ఎద్దేవా చేయడం పాకిస్థాన్ పరువును మరింత దిగజార్చిందంటూ మండిపడుతున్నారు.అలీ మొయిన్ నవాజ్ అనే ఇక ఓ కాలమిస్ట్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ లో చంద్రుడు భూమి నుండి మూడు లక్షల 84 వేల 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఇక భారతదేశం తాను చేసిన ప్రయోగంలో చివరి రెండు కిలోమీటర్ల దూరం లో ఫెయిల్ అయింది.వారు చంద్రునికి దగ్గరగా ఉన్న రోవర్ ను సాధించగలిగారు.మేమింకా 73 బిలియన్ లు ఖర్చుపెట్టిన పెషావర్ బి ఆర్ టీ ని తయారు చేయలేక పోయాము. ఇది ఆయుధాల యుద్ధం కాదు, భారత్ సాధించిన అభివృద్ధి అంటూ చేసిన ట్వీట్ కు పాకిస్తానీ ల నుండి చాలా మంచి మద్దతు వచ్చింది. ఎవరూ చేయని సాహసం ఇండియా చేసింది.భారత్ ఇప్పటికే అంతరిక్ష పరిశోధనలో అద్భుతమైన ప్రగతిని సాధించింది.అంగారక గ్రహం మీదకు ఉపగ్రహాలను పంపుతున్నది. దేశవిదేశాలకు చెందిన ఉపగ్రహాలను రోదసీలోకి ప్రవేశపెడుతున్నది. భారత్ చేస్తున్న ప్రయోగాలను మెచ్చుకోవాలి లేందంటే మౌనంగా ఉండాలని పాక్ నెటిజన్లు కూడా పాక్ మంత్రి ఫవాద్‌కు చివాట్లు పెడుతున్నారు.