కాంగ్రెస్ కు ‘మాయా’ షాక్

జైపూర్ : రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీకి నేస్తమైన బీఎస్పీ ప్రస్తుత కష్ట కాలంలో హస్తానికి మొండి చేయి చూపింది. శాసన సభ బల పరీక్షలో కాంగ్రెస్ పార్టీని సమర్థించరాదని ఆ పార్టీ అధినేత్రి మాయావతి సోమవారం తాఖీదు జారీ చేసింది. ‘ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా బీఎస్పీ గుర్తుపైనే విజయం సాధించారు. వీరందరూ బీఎస్పీ అధినేత్రి మాయావతి జారీ చేసిన విప్కు బద్ధులై ఉండాల’ని బీఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. ‘ బీఎస్పీ ఒక జాతీయ పార్టీ. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం ఆయా రాష్ట్ర శాఖలను ఏదో ఒక పార్టీలో విలీనం చేసుకోరాదు. మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ అందరూ విలీనమైతేనే విలీనం జరిగినట్ల’ని వివరించారు. 2019 లోనే బీఎస్పీ నుంచి గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో బీఎస్పీకి షాక్ తగిలింది. ఆ ఎమ్మెల్యేలందరూ రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషిని కలిసి తాము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని లిఖిత పూర్వకంగా తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos