హాస్పిటల్‌ డీన్‌తో టాయిలెట్‌ క్లీన్‌ చేయించిన ఎంపీ

హాస్పిటల్‌ డీన్‌తో టాయిలెట్‌ క్లీన్‌ చేయించిన ఎంపీ

ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎంపీపై కేసు నమోదైంది. హాస్పిటల్ డీన్తో ఆయన టాయిలెట్ క్లీన్ చేయించారు. దీంతో శివసేన ఎంపీపై ఆ డీన్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగి విధులను అడ్డుకోవడం, ఆయన పరువు తీయడం వంటి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నాదేండ్ ప్రభుత్వ ఆసుపత్రిలో 48 గంటల్లో 31 మంది రోగులు మరణించారు. ఈ నేపథ్యంలో సీఎం షిండే వర్గం శివసేన ఎంపీ హేమంత్ పాటిల్ మంగళవారం ఆ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రి వార్డుల్లోని టాయిలెట్స్కు తాళాలు వేసి ఉండటం, మరికొన్ని మురికిగా ఉండటంపై ఎంపీ హేమంత్ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాత్కాలిక డీన్ ఆర్ఎస్ వాకోడ్తో టాయిలెట్ క్లీన్ చేయించారు. అలాగే వార్డు నంబర్ ఆరులో ఉన్న మరో టాయిలెట్ను ఆ డీన్తో శుభ్రం చేయించారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఎంపీ హేమంత్ పాటిల్పై ఆసుపత్రి డీన్ వాకోడ్ ఫిర్యాదు చేశారు. తనతో టాయిలెట్లు క్లీన్ చేయించడం వల్ల బీపీ పెరిగినట్లు అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారి విధులు అడ్డుకోవడం, పరువు తీయడం వంటి సెక్షన్ల కింద ఎంపీ హేమంత్ పాటిల్పై పోలీసులు కేసు నమోదు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos