న్యూఢిల్లీ : కరోనా వైరస్ నిరోధించేందుకు అందిస్తున్న కోవిషీల్డ్ టీకాల మోతాదుల మధ్య వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచవచ్చునని నేషనల్ ఇమ్యునిజేషన్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (ఎన్ఐటిజిఎ) గురువారం సిఫార్సు చేసింది. కోవాగ్జిన్ మోతాదుల వ్యవధి విషయంలో ఎలాంటి మార్పుల్ని సూచించ లేదు. గతంలో మొదటి, రెండవ మోతాదులు మధ్య అంతరం సుమారు నాలుగు నుంచి ఆరు వారాలు. గర్భిణీలు టీకాలిన ఎప్పుడు వేసుకోవాలనే నిర్ణయాన్ని ఆమెకు వదిలేయాలి. ప్రసవం తర్వాత కూడా వారు వ్యాక్సిన్ వేసుకునేందుకు అర్హులని పేర్కొంది. సార్క్-కోవిడ్ 2తో అనారోగ్యం బారిన పడి..కోలుకున్న వారికి ఆరు నెలల పాటు తర్వాత టీకా వేయాలని సూచించింది. సిఫార్సులను నేషనల్ ఎక్స్ఫర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్కు పంపించనుంది.