ఆఫ్ఘనిస్తాన్‌కు ఎదురు దెబ్బ

  • In Sports
  • June 7, 2019
  • 184 Views
ఆఫ్ఘనిస్తాన్‌కు ఎదురు దెబ్బ

లండన్‌ : గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌ వికెట్‌ కీపర్‌, ఆ జట్టు కీలక బ్యాట్స్‌మన్‌ హెహజాద్‌ ప్రపంచ కప్పు టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించాడు. పాకిస్తాన్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో గాయపడిన అతను ఆసీస్‌, శ్రీలంకతో జరిగిన మ్యాచుల్లో ఆడాడు. దీంతో గాయం తిరగదోడింది. నొప్పి ఎక్కువ కావడంతో వైదొలగాల్సి వచ్చింది. గత ప్రపంచ కప్పు నుంచి ఆఫ్ఘనిస్తాన్‌ బ్యాటింగ్‌కు పెద్ద దిక్కుగా ఉన్న షెహజాద్‌ 55 మ్యాచుల్లో 1,843 పరుగులు చేశాడు. కీలక సమయాల్లో మంచి బ్యాటింగ్‌ నైపుణ్యాన్ని జట్టును గట్టుకు చేర్చిన సందర్భాలెన్నో ఉన్నాయి.  అతని స్థానంలో వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ఇక్రమ్‌ అలీకి చోటు దక్కింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos