అలాంటి అమ్మాయి దొరికితే ప్రభాస్ పెళ్లి చేస్తాం..

  • In Film
  • December 27, 2019
  • 177 Views
అలాంటి అమ్మాయి దొరికితే ప్రభాస్ పెళ్లి చేస్తాం..

తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుత జనరేషన్‌ హీరోల్లో పెళ్లికాని ప్రసాదుల జాబితా చాలా పెద్దగానే ఉంది.ఈ జాబితాలో అందరికంటే ముందు వరుసలో డార్లింగ్‌ ప్రభాస్‌ ఉన్నాడు.మిర్చి చిత్రం నుంచే ప్రభాస్‌ పెళ్లిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్‌ పెళ్లిపై ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు అర్ధాంగి శ్యామలాదేవి స్పందించారు. ‘జాన్సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ స్పష్టంగా చెప్పాడని, తాము కూడా ఘడియల కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.అయితే, ప్రభాస్ ను చేసుకోబోయే అమ్మాయి తమలో సులభంగా కలిసిపోయేలా ఉండాలని, ఎందుకంటే తమది చాలా పెద్ద కుటుంబం అని శ్యామలాదేవి వివరించారు. అమ్మాయి అందరినీ కలుపుకునిపోయే మనస్తత్వం కలిగివుండాలని స్పష్టం చేశారు. అలాంటి అమ్మాయి దొరికితే ప్రభాస్ పెళ్లి చేస్తామని అన్నారు. ఇక, ప్రభాస్ పెళ్లిపై వచ్చే ఊహాగానాలను తాము పట్టించుకోమని, అవి తమకు నవ్వు తెప్పించేవిగా ఉంటున్నాయని తేల్చేశారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos