అమరావతి: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహనరెడ్డి భేటీ మరో సారి రద్దయింది. భేటీకి జగన్ కు కేటాయించిన వేళను రద్దు చేపినట్లు అమిత్ షా కార్యాలయం జగన్ కు తెలిపింది. మహారాష్ట్ర, హర్యానా శాసనసభల ఎన్నికలు జరుగుతుండటమే ఇందుకు కార ణంగా భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో నామపత్రాల దాఖలు, ప్రచారం పూర్తయ్యేంత అమిత్ షాకు తీరిక ఉండదు. ఇతరులతో భేటీ అయ్యే పరిస్థితి లేద ని హోమ్ శాఖ అధికారులు వివరించారు. ఇటీవలి కాలంలో వారి భేటీ రద్దు కావడం ఇది రెండో సారి.