శత్రుఘ్న సిన్హాకు పాక్‌లో ఏం పని?

శత్రుఘ్న సిన్హాకు పాక్‌లో ఏం పని?

భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న పరిస్థితుల గురించి తెలిసి కూడా పాకిస్థాన్‌ వెళ్లి ఎంజాయ్‌ చేసిన కాంగ్రెస్‌ నేత శత్రుఘ్న సిన్హాపై నెటిజన్లు, సాధారణ ప్రజలు మండిపడుతున్నారు.లాహోర్లో ఆయన వివాహ వేడుకకు హాజరై, నవ్వుతూ కనపడ్డారు.ఒకవైపు భారత్, పాకిస్థాన్మధ్య వాతావరణం సరిగ్గా లేదని, మరోవైపు ఆయన శత్రు దేశానికి వెళ్లారని నెటిజన్లు విమర్శల జల్లు కురిపిస్తున్నారు. ‘దేశ సరిహద్దుల వద్ద భారత జవాన్లు ప్రాణాలు కోల్పోతుంటే మన బాలీవుడ్ప్రముఖులు మాత్రం పాకిస్థానీలతో తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారుఅని కామెంట్లు చేస్తున్నారు. శత్రుఘ్న సిన్హాకు పాక్లో ఏం పని? అని ప్రశ్నిస్తున్నారు. ప్రతిక్షణం భారత్‌పై విషం చిమ్ముతూ దేశంలో విధ్వంసాలకు పాల్పడడానికి ప్రయత్నిస్తుంటే మీరు మాత్రం స్నేహం,వ్యాపారం అంటూ పాకిస్థాన్‌తో చేతులు కలుపుతారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos