ఢిల్లీ : భాజపా రెబల్ స్టార్ శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ పథకాన్ని ప్రస్తుతించారు. ఈ పథకం ద్వారా రాహుల్ భాజపాను దెబ్బకొట్టారని పేర్కొన్నారు. రాహుల్ ఈ పథకాన్ని ప్రకటించగానే, భాజపా నేతలంతా కలవరపాటుకు గురయ్యారని, ఆ పథకాన్ని విమర్శిస్తూ మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించారని ఎద్దేవా చేశారు. దేశంలో ప్రతి ఒక్కరి ఖాతాలోకి రూ.15 లక్షలు, వ్యవసాయ రుణ మాఫీ, ఏటా రెండు కోట్లకు పైగా ఉద్యోగాలు లాంటి మోసపూరిత హామీలు ఇవ్వవచ్చా..అంటూ ఆయన భాజపా నాయకులను దెప్పి పొడిచారు. రాహుల్ ప్రకటన పట్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు.