కరోనా ధాటికి విలవిల్లాడుతున్న అమెరికా,ఫ్రాన్స్.ఇటలీ,బ్రెజిల్ తదితర అన్ని దేశాలు కరోనా బారి నుంచి తమను రక్షించాలంటూ భారత్‌ను వేడుకుంటున్నాయి.భారత్‌లో అత్యధికంగా ఉత్పత్తి అయ్యే హైడ్రాక్సీ క్లోరోక్విన్కు కరోనాను ఎదుర్కొనే శక్తి ఉందని తేలడంతో ఇప్పుడు ఆయా దేశాలన్నీ భారత్‌ను వేడుకుంటున్నాయి.ఇక పెద్దన్నగా పెత్తనం చెలాయించే అమెరికా అయితే బెదిరింపులకు సైతం దిగడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు భయపడో లేక మానవతా దృక్పథమో తెలియదు కానీ ప్రధాని నరేంద్రమోదీ దేశ అవసరాలకు సరిపడా నిల్వలు ఉంచుకొని మిగిలిన దానిని ప్రపంచ దేశాలకు అందించడానికి నిర్ణయించుకున్నారు.ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంపై భగ్గుమన్నాయి.మేధావులు సైతం మోదీ నిర్ణయాన్ని తప్పుపట్టారు.కాంగ్రెస్ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ఒక సూటి ప్రశ్నను వేశారు.’మిస్టర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్… మీరు కోరిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్ ను ఎలాంటి స్వార్థం లేకుండా మీకు అందించేందుకు భారత్ అంగీకరించింది. అమెరికా ప్రయోగశాలల్లో కరోనాకు ఏదైనా వ్యాక్సిన్ ను కనుక్కుంటే… దాన్ని అందరి కంటే ముందు భారత్ కు ఇచ్చేందుకు అనుమతిస్తారా?’ అని ట్విట్టర్ ద్వారా శశిథరూర్ ప్రశ్నించారు.శశిథరూర్ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి భారీగా మద్దతు లభిస్తోంది.