అరాచకాలపై మౌనమెందుకు పవనా?

అమరావతి: వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో తాము మూడో సంస్థ విచారణకు డిమాండు చేసినపుడు జపసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నోరు విప్పక పోవటానికి గల కారణాలేమిటని వైకాపా అధ్యక్షుడు జగన్‌ సోదరి వై.ఎస్‌. షర్మిల ప్రశ్నించారు. సోమవారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో ఆమె మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. ‘సిని నటులు దర్శకుడు చెప్పినట్లు నటిస్తారు. పవన్ కళ్యాణ్ రాజకీయ సినిమాలో దర్శకుడు చంద్రబాబు నాయుడు సూచించినట్లు పవన్ కళ్యాణ్ నటిస్తున్నార’ని ఎద్దేవా చేశారు. డేటా చోరీ విషయంలోవైకాపా ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నా పవన్ కళ్యాణ్ ఉలకరు పలకరు ఎందుకని మరో ప్రశ్నాస్త్రాన్ని సంధించారు. ‘పవన్ కళ్యాణ్ నామ పత్రాల్ని దాఖలు చేసిన కార్యక్రమంలో తెదేపా జెండాలు కూడ కన్పించాయి. పైకి మాత్రం తమ మధ్య ఎలాంటి పొత్తులు లేవని చెబుతున్న అంతర్గతంగా మాత్రం సర్ధుబాటు చేసున్నాయ’ని విమర్శించారు. పవన్ కళ్యాణ్‌కు ఓటేస్తే చంద్రబాబుకు ఓటేసినట్లేనని చెప్పారు. బాబాయ్ హత్యలో మంత్రి ఆదినారాయణరెడ్డి, తెదేపా నేతలు, చంద్రబాబు నాయుడుకు సంబంధం లేక పోతే మూడో సంస్థచే విచారణకు ఎందుకు ఒప్పు కోవడం లేదని ప్రశ్నించారు. ‘మా కుటుంబంలో మా పెద్ద నాన్న జార్జి రెడ్డి పెద్ద. ఆయన లేరు, ఆ తర్వాత మా నాన్న వైఎస్ఆర్ . తమ కుటుంబానికి వై.ఎస్. వివేకానందరెడ్డి పెద్ద దిక్కు. మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు. ఒక వేళ గొడవలు ఉంటే చంపుకొంటామా. మీ కుటుంబంలో గొడవలు ఉంటే ఇలాగే హత్య లు చేస్తారా’ ని మాధ్యమ ప్రతినిధి ఒకరిని ప్రశ్నించారు. ‘బాబాయ్ని అత్యంత దారుణంగా హత్య చేసింది మనుషులా, మృగాలా అని అనుమానం కలుగుతుంద’న్నారు. బాధితులనే నిందితులుగా చేర్చే కుట్ర జరిగితే తాము ఆత్మరక్షణలో పడతామన్నారు. తెదేపా నేతలు ఇదే వ్యూహానిమ్న అవలంభిస్తున్నారని చెప్పారు. దరిమిలా నేరగాళ్లకు స్వేచ్ఛగా తిరిగే అవకాశం దొరుకుతోందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మా తాత వై.ఎస్. రాజారెడ్డిని దారుణంగా హత్య చేశారు. ఇప్పుడు మళ్లీ చంద్ర బాబు నాయుడు పాలనలోనే చిన్నాన్నహ తులయ్యారని ఆక్రోశించారు.. రాజారెడ్డి హత్యలో తెదేపా డీపీ నేతల పాత్ర ఉందని ఆరోపించారు. వివేకానందరెడ్డి హత్యకూ ఆ పార్టీ నేతలో కారణమని ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos