అనుష్క పై గూర్ఖాల గుర్రు

అనుష్క పై గూర్ఖాల గుర్రు

గువాహటి: బాలీవుడ్ నటి, నిర్మాత అనుష్క శర్మ కు వ్యతిరేకంగా అరుణాచల్ ప్రదేశ్ గూర్ఖా యూత్ అసోసియేషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసింది. పాతాళ్ లోక్ వెబ్ సిరీస్లో తమను కించపరిచే, వివక్ష పూరిత సన్నివేశాలు ఉన్నాయని ఆక్రోశించింది. భారతీయ గూర్ఖా యువ పరిసంఘ్ అధ్యక్షుడు నందా కిరాటి దేవన్ దీని గురించి విలేఖరులతో మాట్లాడారు. ‘పాతాళ్ లోక్ వెబ్సిరీస్లో తమను అవమానపరిచే సన్నివేశాలు ఉన్నాయి. సమాజంలో తమ ప్రతిష్టను దిగజార్చేలా చిత్రీకరించారు. ఆ సన్నివేశాలు ప్రసారమైనపుడు మ్యూట్లో పెట్టి, సబ్టైటిల్స్, డిస్క్లేమర్ వేసి తిరిగి అప్లోడ్ చేయాలి. లేని పక్షంలో చట్టపరమైన చర్యల్ని తీసుకుంటాం. మేఘాలయలో ఖాసీ తెగకు చెందిన ఒక యువతిని అసభ్యంగా దూషిస్తూ, అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించారు. రెండో అధ్యాయంలో ఈ సన్నివేశాలున్నా’యని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos