కాబూల్ : భారత్లో అలజడి సృష్టించే ఉద్దేశం ఏదీ తమకు లేదని తాలిబన్ అధికార ప్రతినిధి మహ్మద్ సుహైల్ షాహీన్ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. భారత్తో సహా ఇతర అన్ని దేశాలతో మైత్రిని కోరుకుంటున్నామని చెప్పారు. ‘గత 18 ఏళ్లుగా మిలిటరీ ద్వారా అమెరికా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అఫ్గాన్ సమస్యకు అమెరికా వద్ద పరిష్కారం ఉంటే శాంతి ఒప్పందం చేసుకోవటానికి మేము సిద్ధం గా ఉన్నాం. లేని పక్షంలో వారు చేదు అనుభవాలు ఎదుర్కోవటం తథ్యం. తమ సైనికుడిల్ని చంపామని ట్రంప్ అంటున్నారు. ఇక్కడ రక్త పాతం మొదలు పెట్టింది ఎవరు? అమెరికా సైన్యాల దాడికి బదులు ఇస్తున్నాం అంతే. మా ప్రజలపై దాడిని తిప్పికొడుతున్నాం. మేము కాబూల్ పాలనలో జోక్యం చేసుకుంటు న్నామనటం అసమంజసం. దేశ అంతర్గత, బాహ్య సమస్యలపై మేము దృష్టి సారించాలను కుంటు న్నామ’ని వివరించారు. ‘మే ము ఇప్పటికే అమెరికాతో చర్చల దశలో ఉన్నాం. ఇతరులకు మేలు చేసే లేక వైరం పెంచుకునేలా వ్యవహరించబోమ’ని పేర్కొన్నాడు. అమెరికా సైన్యం పూర్తిగా వెనక్కి వెళ్లిన తర్వాత భారత్లో తాలిబన్లు అలజడి సృష్టించే అవకాశం ఉందన్న ప్రచారం గురించి కూడా మాట్లాడారు. మాకు ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. దేశ పునర్నిర్మాణానికి, అభివృద్ధికి మేము అంకితం అవుతాం. ఇందుకు భారత్ సహాయం కూడా అవసరమ’ని పేర్కొ న్నాడు.