ఫైజల్ ఫిర్యాదు పై కేంద్రానికి కోర్టు తాఖీదులు

ఫైజల్ ఫిర్యాదు పై కేంద్రానికి కోర్టు తాఖీదులు

న్యూఢిల్లీ: తన నిర్బంధాన్ని సవాల్ చేస్తూ మాజీ ఐఏఎస్ అధికారి, జమ్మూకశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ అధ్యక్షుడు షా ఫైజల్ దాఖలు చేసిన వ్యాజ్యంపై కేంద్రానికి ఢిల్లీ ఉన్నత న్యాయ స్థానం తాఖీదుల్ని జారీ చేసింది. వచ్చేనెల 2లోగా సమాధానం చెప్పాలని న్యాయమూర్తులు మన్మోహన్, సంగీత ధింగ్రా సెహగల్తో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సెప్టెంబర్ 3కి వాయిదా వేసింది. ప్రస్తుతం శ్రీనగర్లో ఆయన్ను పాలకులు నిర్బంధించారు. తనకు వ్యతిరేకంగా జారీ చేసిన లుకౌట్ నోటీసు ప్రతిని ఇప్పించాలని కోర్టుకు మొరపెట్టుకున్నారు. లుకౌట్ నోటీసులు జారీకి గల కారణాలేమిటో తెలియటం లేదని షా ఫైజల్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఈ నెల 13వ తేదీ రాత్రి టర్కీ రాజధాని అంకారా వెళ్లేందుకు ప్రయత్నించిన ఫైజల్ను, అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో అడ్డగించి శ్రీనగర్కు పంపారు. అదే రోజు నుంచి ఆయనను అక్కడే గృహ నిర్బంధంలో ఉంచారు. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతి పత్తి రద్దును ఫైజల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos