వరంగల్‌లో ఘోరం..బావిలో శవాలుగా తేలిన వలస కుటుంబం..

వరంగల్‌లో ఘోరం..బావిలో శవాలుగా తేలిన వలస కుటుంబం..

వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట పారిశ్రామికవాడలో దారుణం జరిగింది. కోల్కతాకు చెందిన వలస కార్మికుల కుటుంబం బావిలో  శవాలై తేలడం స్థానికంగా కలకలం రేపింది. కోల్కతాకు  చెందిన మక్సూద్ (50) 25 ఏళ్లుగా వరంగల్ అర్బన్ జిల్లాలోని కరీమాబాద్లో బార్దాన్ కూలీగా పనిచేస్తున్నాడు. భార్య నిషా (45), ఇద్దరు కుమారులతోపాటు భర్తతో విడాకులు తీసుకున్న కుమార్తె కూడా వారితోనే ఉంటోంది. లాక్డౌన్ నేపథ్యంలో వీరి కుటుంబం పారిశ్రామికవాడలోని సాయిదత్తా బార్దాన్ట్రేడర్స్లోని భవనంలోనే ఉంటోంది. అదే భవనంలో బీహార్యువకులు కూడా ఉంటున్నారు.ట్రేడర్స్ యజమాని నిన్న భవనం వద్దకు రాగా, వీరెవరూ కనిపించలేదు. దీంతో ఆయన గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం అక్కడే వెతుకుతుండగా ప్రాంగణంలోని బావిలో శవాలు తేలుతూ కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. వారిని మక్సూద్, నిషా, వారి 22 ఏళ్ల కుమార్తె బుషారాకతూన్, మూడేళ్ల మనవడు బేబీగా గుర్తించారు.శుక్రవారం మరోసారి అదేబావిలో మూడు మృతదేహాలు లభించగా షకీల్‌, షాబాజ్అలం, సోహైల్ అలంగా గుర్తించారు.కాగా అదే భవనంలో ఉంటున్న బీహార్ యువకులు సైతం అదృశ్యం కాగా అందులో శ్రీరాం, శ్యాం అనే ఇద్దరి యువకుల మృతదేహాలు లభించడంతో మిగిలిన యువకుల కోసం గాలిస్తున్నారు.కాగా మక్సూద్ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు కూడా లేవని, వారి కుటుంబం మొత్తం కలిసి రోజుకు నాలుగు వేల రూపాయలు సంపాదిస్తోందని ట్రేడర్స్ యజమాని తెలిపాడు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos