అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ఉభయ సభల బడ్జెట్ సమావేశాలు మంగళ వారం నుంచి ప్రారంభం కానున్నాయి. సభ్యుల్ని నుద్దేశించి గవర్నర్ విశ్వ భూషణ్ వీడియో ద్వారా ప్రసంగిస్తారు. ఆ తర్వాత సభా వ్యవహారాల సలహా సమితి సమావేశమై ఎన్ని రోజులు సమావేశాలు నిర్వ హించాలో నిర్ణయిస్తారు. సభాపతి తమ్మినేని సీతారాం నేతృత్వంలో సోమవారం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘మంగళవారం ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమౌతాయని తెలిపారు. ఉభయ సభల ప్రతి ఆసనాన్నీ శానిటైజ్ చేస్తున్నాం. సభ్యులందరికీ వైద్య పరీక్షలు చేస్తాం. భద్రతను కట్టు దిట్టం చేసాం. సభ్యులు మినహా ఎవర్ని సభలోకి అనుమతించం. భౌతిక దూరాన్ని పాటించి సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేసామ’ని వివరించారు.