హైదరాబాదు: అడవి శేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ‘మేజర్’ సినిమా ఫస్ట్లుక్ను నటుడు మహేశ్ బాబు గురువారం విడుదల చేశారు. 26/11లో జరిగిన ముంబై ఉగ్రదాడిలో పోరాడి వీరమరణం చెందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. శశి కిరణ్ దర్శకుడు. సోనీ పిక్చర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. శోభితా ధూళిపాళ్ల, సైయీ మంజ్రేకర్ కథానాయికలు. తెలుగు, హిందీ భాషల్లో వచ్చే వేసవిలో విడుదల కానుంది.