నాపేరు సూర్య చిత్రం డిజాస్టర్ కావడంతో దాదాపుగా ఏడాది కాలం కొత్త చిత్రాలు అంగీ్కరించకుండా బ్రేక్ తీసుకున్న అల్లు అర్జున్ కొద్ది కాలం క్రితం రెండు మూడు చిత్రాలను లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే.అందులో త్రివిక్రమ్ కలసి నటిస్తున్న చిత్రం కూడా ఒకటి.ఇంకా పేరు పెట్టని చిత్రాన్ని గీతా ఆర్ట్స్,హారిక హాసిని బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.ఇక ఈ చిత్రంలో మరో కీలకపాత్ర పోషిస్తున్న ఒకప్పటి హీరోయిన్ టబు తాజాగా చిత్రీకరణలో పాల్గొన్నారు.దాదాపు దశాబ్ద కాలంపైగా తెలుగు చిత్రాల్లో కనిపించని టబు ఈ చిత్రంతో తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు.తాజాగా టబుకు సంబంధిచి ఆన్ లొకేషన్ ఫోటొలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి..