తెలుగు చిత్ర పరిశ్రమ ద్వారా వెండితెరకు పరిచయమై స్టార్ హీరోయిన్ గా ఎదిగి కెరీర్ పీక్స్ లో ఉండగా బాలీవుడ్ వెళ్లి అక్కడ ఎదో కొన్ని అవకాశాలు రాగానే దక్షిణాది పరిశ్రమను ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమపై అక్కసు వెళ్లగక్కిన ఇలియానా మల్లి తెలుగు పరిశ్రమను నిర్లక్ష్యం చేస్తోంది.ఏరు దాటాక తెప్ప తగలేసి చందాన బాలీవుడ్ వెళ్ళాక తెలుగు పరిశ్రమపై అవాకులు చవాకులు కూసిన ఇలియానా ప్రేమలో విఫలమయ్యాక ఎక్కడ అవకాశాలు రాని సమయంలో మల్లి తెలుగు పరిశ్రమనే అవకాశం ఇచ్చింది.అప్పటి నుంచి కొద్దిగా క్రేజ్ రాగానే మళ్ళీ ఇతర పరిశ్రమలపై మోజు చూపుతూ తెలుగు పరిశ్రమపై అవాకులు చవాకులు పేలుతోంది.తెలుగు కంటే తమిళ్ ఇండస్ట్రీకే ప్రాధాన్యత ఇస్తోందని కాస్టింగ్ వర్గాలు చెప్తున్నాయి. తెలుగు సినిమాల గురించి పక్కన పెట్టండి.. తమిళ్ లో ఏదైనా క్రేజీ ప్రాజెక్ట్ వెతకండి అని వారికి బంపర్ ఆఫర్ ఇస్తుందట ఇలియానా. మొత్తం మీద ఈ సీనియర్ బ్యూటీ మరోసారి సౌత్ ఇండస్ట్రీని తన అందచందాలతో కట్టిపడేయడానికి రెడీ అయిందనేది మాత్రం అర్థం అవుతోంది. ఇక ఇలియానా అభిషేక్ బచ్చన్ తో కలిసి నటించిన హిందీ మూవీ ”ది బిగ్ బుల్” త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.