ముంబై: రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో భాగ స్వాములం కావాలా వద్దా అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీతో చర్చించిన తర్వాతే నిర్ణయిస్తామని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. సోమవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రి పదవికి శివ సేన పార్లమెంటు సభ్యుడు అరవింద్ సావంత్ రాజీనామా చేయడంతో ఎన్డీయే నుంచి శివసేన బయటికి వచ్చేసిన ట్టైంది.‘ఎవరో రాజీనామా చేసిన దానిపై నేనేమీ మాట్లాడను. సోమవారం కాంగ్రెస్తో మాట్లాడతాం.ఆ చర్చల తర్వాతే నిర్ణయాన్ని వెల్లడిస్తామ’ని పేర్కొన్నారు. ‘ భవిష్యత్తు కార్యా చరణపై చర్చించేందుకు కోర్ కమిటీ సమావేశమైంది. ప్రభుత్వంలో మేము చేరా లంటే ముందు ఎన్డీయే నుంచి శివసేన బయటికి రావాలని మేము చెప్పాం. ఇప్పుడు ఏ ప్రాతిపదికన ప్రభుత్వం ఏర్పాటు చేయా ల న్నదానిపై చర్చలు జరుపుతామ’ని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ పేర్కొన్నారు.