ఆత్మ రక్షణలో బీజేపీ

జైపూర్: రాష్ట్రంలో రాజకీయం సన్నివేశం తిరుగ బడింది. విపక్ష భాజపా కూడా విలాస విడిది రాజకీయాలకు తెర లేపింది. సచిన్ పైలట్ తిరుగుబాటు వల్ల పాలక కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని నాయకత్వం విలాస విడిదిలో ‘బంధించింది’. శాసనసభ సమావేశాలు వచ్చే 14 నుంచి ప్రారంభం కానున్నందున విపక్ష భాజపాకూ సభ్యులు చేజారి పోతారనే భీతి పట్టుకుంది. దీంతో భాజపా ఉదయ పూర్ లోక్సభ నియోజక వర్గంలోని 12 మంది శాసన సభ్యుల్ని భాజపా గుజరాత్కు తరలించినట్లు సమాచారం. వారే స్వచ్ఛందంగా సోమనాథ్ ఆలయ దర్శనార్థం వెళ్లినట్లు కమలనాధులు చెబుతున్నారు. 12 వరకూ వారు గుజరాత్లోనే ఉంటారు. మిగిలిన వారినీ మధ్యప్రదేశ్కు తరలించనున్నట్లు తెలిసింది. ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరటం పై హైకోర్టు తీర్పు కోసం భాజపా ఎదురు చూస్తోంది. తీర్పును బట్టి వ్యూహానికి పదును బెట్టనుంది. భాజపా శాసనసభ్యుల్ని ముఖ్యమంత్రి గెహ్లోత్ ఆకర్షిస్తారనే భయం భాజపాలో ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos