సియోల్ : దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఓ ముఠా నిర్వాకం వల్ల దంపతుల పడక సీన్లు బహిర్గతమయ్యాయి. ఓ ముఠా, మిల్లీమీటరు మందంతో ఉండే కెమెరాలను టీవీ బాక్సులు, వాల్ సాకెట్లు, హెయిర్ డ్రయ్యర్లలో అమర్చి గుట్టుగా వీడియోలు తీసింది. ఈ వీడియోలను ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసి, ముఠా సభ్యులు భారీ మొత్తంలో డబ్బులు ఆర్జించారు. గత ఏడాది నవంబరు నుంచి ఈ వ్యవహారం సాగుతున్నట్లు పోలీసులు కనుక్కొన్నారు. దేశంలోని పది నగరాల్లో ఉండే ముప్పై వేర్వేరు హోటళ్లలోని నలభై గదుల్లో కెమెరాలను అమర్చారు. వీటి ద్వారా చిత్రీకరించిన వీడియోలను నాలుగు వేల మందికి పైగా సభ్యులున్న వెబ్‌సైట్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీని కోసం సభ్యుల నుంచి భారీగానే వసూలు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.