మొదలైన రెండవ విడత స్థానిక ఎన్నికలు..

మొదలైన రెండవ విడత స్థానిక ఎన్నికలు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడత జిల్లా,మండల పరిషత్‌ ఎన్నికలకు శుక్రవారం ఉదయం మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 180 జిల్లా,1,913 మండల పరిషత్‌ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఒక జిల్లా,63 మండల పరిషత్‌ స్థానాలు ఏకగ్రీవం కావడంతో 179 జిల్లా,1,850 మండల పరిషత్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.మొదటి విడత ఎన్నికల తరహాలోనే రెండవ విడత ఎన్నికల్లో కూడా జిల్లా పరిషత్‌ ఎన్నికలకు తెలుగు రంగు,మండల పరిషత్‌ ఎన్నికలకు గులాబి రంగు బ్యాలెట్‌ పత్రాలు వినియోగించారు.ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుండగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్‌ ముగించనున్నారు.ఈనెల 14వ తేదీన 161 జిల్లా,1,738 మండల పరిషత్‌ స్థానాలకు మూడవ విడతలో పోలింగ్‌ నిర్వహించనున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos