ఇరాక్‌ పై రెండో వైమానిక దాడి

ఇరాక్‌ పై రెండో వైమానిక దాడి

బాగ్దాద్: ఇరాక్లో రెండో రోజూ- శనివారం తెల్లవారు జామున ఇరాన్ మద్దతు కలిగిన పారామిలిటరీ నగర ఉత్తర భాగంలో రక్షణ బలగాల వాహన శ్రేణిపై దాడులు జరిగాయి.కనీసం ఆరుగురు మృతి చెందినట్లు భావిస్తున్నారు. కమాండర్-హషీద్ అల్ షాబీ’ లక్ష్యంగా దాడి జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇరాన్ ఉన్నత కమాండర్ జనరల్ ఖాసిం సులేమానీపై శుక్రవారం జరిపిన దాడిలో హషీద్ అల్ షాబీ డిప్యూటీ కమాండర్ అబు మహదీ అల్ ముహందిస్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే దళానికి చెందిన కమాండర్ను లక్ష్యంగా తాజా దాడి జరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం దాడుల్లో మరణించిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండోలు, హషీద్ అల్ షాబీ’ దళ సభ్యులకు ఇరాక్లోని ఇరాన్ మద్దతుదారులు శనివారం సంతాప యాత్ర నిర్వహించనున్నారు. ఆ తర్వాత మృత దేహాల్ని ఇరాన్కు అప్పగించనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos