దగ్గరగా దూసుకెళ్లిన భారీ గ్రహశకలం..

దగ్గరగా దూసుకెళ్లిన భారీ గ్రహశకలం..

భూగ్రహానికి అత్యంత సమీపం నుంచి ఓ భారీ గ్రహశకలం దూసుకెళ్లిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించింది.వెయ్యి అడుగుల ఎత్తు 300 మీటర్ల కంటే వైశాల్యం ఉన్న 2000 క్యూడబ్ల్యూ 7 భారీ గ్రహశకలం భూగోళానికి దగ్గరగా అత్యంత సమీపంలో అంటే ..3 లక్షల 30 వేల కిలోమీటర్ల దూర నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లిందీ బాహుబలి గ్రహ శకలం. వినడానికి 3 లక్షల 30 వేల కిలోమీటర్లే అయినప్పటికీ.. అంతరిక్ష పరిశోధకులు, శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. ఇది అత్యంత సమీపం. భూమిని దాటే సమయంలో దాని వేగం అనూహ్యం. గంటకు 14,400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా వెల్లడించింది. అంతరిక్షంలోకి వెళ్లిపోయిన ఆ గ్రహ శకలం మళ్లీ భూమి వైపు రావడానికి కనీసం వంద సంవత్సారలకు సమయం పట్టొచ్చిన అభిప్రాయపడ్డారు. అంతరిక్షంలో శబ్దం ప్రయాణించదు. శబ్దమే ప్రయాణించి ఉన్నట్టయితే.. 2000 క్యూడబ్ల్యూ 7 గ్రహ శకలం దూసుకెళ్లిన సమయంలో జూమ్ అంటూ వెలువడిన శబ్దాన్ని భూమ్మీద నివసిస్తోన్న ప్రతి ప్రాణీ వినగలిగి ఉండేదట.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos