కర్ణాటకలో మోగనున్న బడి గంటలు

కర్ణాటకలో మోగనున్న బడి గంటలు

బెంగళూరు: కర్ణాటకలో కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా మూతపడిన బడులు కొత్త సంవత్సరం నాడు తెరుచుకోనున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా కర్ణాటక విద్యా శాఖ మంత్రి ఎస్ సురేష్ కుమార్ సోమవారం వెల్లడించారు. 10, 12 తరగతుల వారి కోసం పాఠశాలలను జనవరి 1 నుంచి తెరుస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. స్ట్రెయిన్ వైరస్‌పై కొన్ని దుష్ప్రచారాలు జరుగుతున్నాయని, అయితే.. జనవరి 1 నుంచి ముందుగా ప్రణాళిక రూపొందించుకున్నట్లుగానే బడులను తెరుస్తున్నామని ఆయన తెలిపారు. పాఠశాలలకు వచ్చే క్లాసులు వినాలన్న తప్పనిసరి నిబంధన ఏమీ లేదని, తల్లిదండ్రులు, విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులు వినేందుకు మొగ్గు చూపినా తమకు అభ్యంతరం లేదన్నారు. అలాంటి వారు ఇంటి నుంచే చదువుకోవచ్చన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos