న్యూ ఢిల్లీ: 2006 నాటి ముంబై రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు ఇటీవలే సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక న్యాయస్థానం 2015లో ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ శిక్ష పడిన మొత్తం 12 మందిని నిర్దోషులుగా తేల్చింది. హైకోర్టు తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాజాగా స్టే విధించింది. అయితే, హైకోర్టు ఆదేశాలతో విడుదలైన ఖైదీలను మళ్లీ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.