న్యూ ఢిల్లీ: ముందస్తు బెయిలు కోసం మద్యం కేసు నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన వినితిని పిటిషన్ సుప్రీం కోర్టుతిరస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. నిందితుల పిటిషన్ ఇప్పుడు విచారణార్హం కాదన్నారు. హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారన్నారు. ఉన్నత న్యాయస్థానం నిందితుల ముందస్తు బెయిల్ నిరాకరించిందని కోర్టు దృష్టికి తెచ్చారు. హైకోర్టు తుది తీర్పు ఇచ్చినందున ముందస్తు బెయిల్‌పై విచారణ కుదరదని జస్టిస్ పార్థివాలా ధర్మాసనం తేల్చి చెప్పింది. అవసరం అనుకుంటే నిందితులు మరో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. మరో పిటిషన్‌కు నిందితులు అనుమతి కోరగా, వారి విజ్ఞప్తిని న్యాయస్థానం అంగీకరించింది. విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది.