మాజీ మంత్రి మ‌ర్డ‌ర్ కేసులో.. మాజీ ఎమ్మెల్యేకు జీవిత‌కాల జైలుశిక్ష‌

మాజీ మంత్రి మ‌ర్డ‌ర్ కేసులో.. మాజీ ఎమ్మెల్యేకు జీవిత‌కాల జైలుశిక్ష‌

న్యూఢిల్లీ: బీహార్ మాజీ మంత్రి బ్రిజ్ బిహారీ ప్ర‌సాద్ హ‌త్య కేసులో.. మాజీ ఎమ్మెల్యే మున్నా శుక్లాకు ఇవాళ సుప్రీంకోర్టు జీవితకాల జైలుశిక్ష  విధించింది. 1998లో జ‌రిగిన మ‌ర్డ‌ర్ కేసులో మాజీ ఎమ్మెల్యేతో పాటు మ‌రో వ్య‌క్తికి కూడా జీవిత‌ఖైదు విధించారు. జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, సంజ‌య్ కుమార్‌, ఆర్ మ‌హాదేవ‌న్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసులో ఇవాళ తీర్పును ఇచ్చింది. మాజీ మంత్రి హ‌త్య కేసులో దోషుల్ని రిలీజ్ చేస్తూ ఇచ్చిన పాట్నా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు ప‌క్క‌న‌పెట్టింది. నిందితులు మంటు తివారీ, మాజీ ఎమ్మెల్యే శుక్లా.. 15 రోజుల్లోగా లొంగిపోవాల‌ని కోర్టు ఆదేశించింది. మాజీ ఎంపీ సూర‌జ్‌భాన్ సింగ్‌తో పాటు మ‌రో ఆరుగుర్ని ఈ కేసులో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్దోషులుగా ప్ర‌క‌టించారు. 302(మ‌ర్డ‌ర్), 307(హ‌త్యాయ‌త్నం) కేసుల కింద తివారీ, శుక్లాపై అభియోగాలు రుజువు అయిన‌ట్లు కోర్టు చెప్పింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos