ముఖ్యమంత్రులంటే రాజులు కాదు : ఉత్తరాఖండ్‌ ప్రభుత్వానికి చీవాట్లు

ముఖ్యమంత్రులంటే రాజులు కాదు : ఉత్తరాఖండ్‌ ప్రభుత్వానికి చీవాట్లు

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రులంటే రాజులు కాదని, వారి ఆదేశాలను పాటించాలనే పెత్తందారీ కాలంలో ఇప్పుడు లేమని ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. రాజాజీ టైగర్ రిజర్వ్ డైరెక్టర్గా వివాదాస్పద ఐఎఫ్ఎస్ అధికారిని నియమించాలన్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నిర్ణయాన్ని జస్టిస్ బి.ఆర్.గవై, జస్టిస్ పి.కె.మిశ్రా, జస్టిస్ కె.వి.విశ్వనాథన్ల ధర్మాసనం గురువారం తప్పుపట్టింది.”ఈ దేశంలో ప్రభుత్వం విశ్వసనీయత కలిగి ఉండాలనే సిద్ధాంతం ఉంది. ముఖ్యమంత్రులను రాజులుగా భావించలేం. వారు ఏం చెప్పినా అధికారులు చేయాలని లేదు. మనం భూస్వామ్య కాలంలో లేము. కేవలం ఆయన ముఖ్యమంత్రి మాత్రమే. సిఎం అయినంత మాత్రాన ఏమైనా చేస్తారా” అని ధర్మాసనం తీవ్రంగా మందలించింది.ఐఎఫ్ఎస్ అధికారిపై క్రమశిక్షణా చర్యల విచారణ పెండింగ్లో ఉందని, అయినప్పటికీ ముఖ్యమంత్రికి ఆ అధికారిపై ప్రత్యేకమైన ఆసక్తి ఏమిటని ప్రశ్నించింది. రాజాజీ టైగర్ రిజర్వ్లో అధికారిని నియమించరాదని నోట్లో పేర్కొనడాన్ని హైలెట్ చేసిన సుప్రీంకోర్టు.. సిఎం దానిని పట్టించుకోలేదని తెలిపింది.కార్బెట్ టైగర్ రిజర్వ్ మాజీ డైరెక్టర్ అయిన ఐఎఫ్ఎస్ అధికారి రాహుల్ను రాజాజీ టైగర్ రిజర్వ్ డైరెక్టర్గా నియమించడాన్ని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సహా ఇతర సీనియర్ అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, సెప్టెంబర్ 3న ఆ అధికారి నియామక ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos