
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో రోడ్ షోలు, బైక్ ర్యాలీల్ని నిషేధించేలా భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఉత్తర ప్రదేశ్ మాజీ డీజీపీ విక్రమ్ సింగ్ శైవిక అగర్వాల్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అత్యున్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. ‘మేము దీన్ని విచారించబోవడం లేద’ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. వ్యాజ్యాన్ని దాఖలు చేసిన వారి తరఫు న్యాయవాది విరాగ్ గుప్తా విచారణకు హాజరయ్యారు. రోడ్ షోలు, బైక్ ర్యాలీలు ఎన్నికల సంఘం నిబంధనలకు వ్యతిరేకమనీ, పర్యావరణానికి ముప్పు కలిగిస్తాయని వ్యాజ్యంలో పేర్కొన్నారు.