చండిఘడ్ : ధనీమహ్తాబ్ గ్రామంలో ప్రమాదకరమైన స్థితిలో ఉన్న తల్లి సోమాదేవీని చాకచక్యంగా రక్షించాడు 11 ఏళ్ల బాలుడు. శరీరం విషపూరితమై ఆందోళనకర పరిస్థి తుల్లో ఉన్న ఆమె గురించి ఎమర్జెన్సీ నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే బాధితురాలిని ఆసుపత్రికి తరలించి రక్షించారు. సంబంధిత వీడియోను పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమెపై విషప్రయోగం జరిగిందా లేక ఆమె ఆత్మహత్యకు యత్నించిందా? అనే కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.