
పనాజీ: గోవా విధాన సభలో బుధవారం జరిగిన విశ్వాస పరీక్షలో నూతన ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ నెగ్గారు. మొత్తం 20 మంది సభ్యులు ఆయనకు అండగా నిలబడ్డారు. భాజపా సభ్యుల సంఖ్య పన్నెండు కాగా, గోవా ఫార్వార్డ్ పార్టీ (జీఎఫ్‌పీ), మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీలకు చెందిన ముగ్గురుసి సభ్యులు, మరో ముగ్గురు స్వతంత్ర సభ్యులు కూడా సావంత్‌ను బల పరచారు. మనోహర్ పారికర్ మరణంతో నూతన ముఖ్యమంత్రి ఎంపిక, దిగువ సభలో విశ్వాస పరీక్ష అనివార్యమయ్యాయి. పారికర్ మృతితో గోవా విధానసభ సభ్యుల సంఖ్య 36కు పడిపోయింద. విపక్ష కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 14. మొత్తం విధానసభ సభ్యుల సంఖ్య నలభై. ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు సభ్యుల పదవులకు రాజీనామా చేసారు.ఫారికర్ మృతి తర్వాత స్వతంత్ర అభ్యర్థులతో పాటు చిన్న పార్టీల మద్దతు కూడా తమకే ఉన్నందున ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హాను కాంగ్రెస్ కోరింది. దరిమిలా బలనిరూపణకు గవర్నర్ కొత్త ప్రభుత్వాన్ని ఆదేశించారు.