న్యూఢిల్లీ: పూల్వామా దాడిని ప్రమాదమని ట్వీట్ చేసినందుకు తనకు వ్యతిరేకంగా కేసును దాఖలు చేసి విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ బుధవారం ప్రధాని మోదీకి ట్వీట్లో సవాలు విసిరారు. ‘నేను చేసిన ట్వీట్‌తో నన్ను పాకిస్థాన్ మద్దతుదారుడినని, దేశద్రోహినని మీరు, మీ మంత్రులు ముద్ర వేసారు. ఈ ట్వీట్‌ను ఢిల్లీలోనే చేశాను. ఢిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నారు. మీకు చేవ ఉంటే నాపై కేసు పెట్టండి’ అని దిగ్విజయ్ ట్వీట్ చేశారు. భారత్ జరిపిన వైమానిక మెరుపు దాడులపై విదేశీ మీడియా అనుమానాలు వ్యక్తం చేసిందని దిగ్విజయ్ సింగ్ మంగళవారం చేసిన ట్వీట్ తీవ్ర దుమారాన్ని లేపింది.