పాకిస్తాన్ కు మరో షాకిచ్చిన సౌదీ….

పాకిస్తాన్ కు మరో షాకిచ్చిన సౌదీ….

దాయాది దుర్మార్గాలు తెలియనివి కావు. అయినప్పటికీ భారత నాయకత్వం బలంగా ఉండకపోవటం.. అంతర్జాతీయంగా ఒత్తిడిని తీసుకొచ్చే సత్తా లేకపోవటంతో ఇప్పటివరకు ఎవరైనా ఏదైనా నిర్ణయాన్ని తీసుకోలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు సీన్ మారింది. ప్రధాని మోడీ పుణ్యమా అని.. భారత్ తన వాణిని అంతర్జాతీయ వేదికల మీద బలంగా వినిపించటమే కాదు.. తన ప్రభావాన్ని ప్రదర్శించగలుగుతోంది. దాయాది చిల్లర చేష్టలకు దానికి అర్థమయ్యే భాషలోనే బదులిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా అలాంటి పనే చేసి దిమ్మ తిరిగిపోయేలా చేసింది సౌదీ అరేబియా.పాక్ తో సత్ సంబంధాలు అంతగా లేని సౌదీ తాజాగా పాక్ మ్యాప్ నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్.. గిల్గిత్.. బల్జిస్థాన్ లను తొలగిస్తూ కొత్త పటాన్ని పెట్టటం ఇప్పుడు చర్చగా మారింది. రియాద్ వేదికగా వచ్చే నెల 21-22 తేదీల్లో జీ-20 దేశాల సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా ప్రపంచ పటంలోని జీ20 దేశాల సభ్య దేశాల్ని డార్క్ షేడ్ లో సౌదీ ఒక చిత్రపటాన్ని రూపొందించింది.అందులో పాక్ దేశ పటంలో పీవోకే.. బలిస్థాన్ లు లేకుండా పాక్ సరిహద్దుల్ని డార్కు షేడ్ చేసింది. ఆర్టికల్ 370 నుంచి జమ్ముకశ్మీర్ నుంచి ఎత్తివేసిన నేపథ్యంలో పాక్ కోరుకున్నట్లుగా సౌదీ స్పందించకపోవటంతో ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు సరిగా లేవు. పాక్ ఆగ్రహంతో సౌదీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తోంది. సౌదీ సైతం పెద్దగా స్పందించని పరిస్థితి. దీంతో.. రెండు దేశాల మధ్య సరైన సంబంధాలు లేవు. ఇలాంటివేళ.. పాక్ పటంలోని పీవోకేను తీసేయటం ఇప్పుడు చర్చగా మారింది. దీనిపై పాక్ ఇప్పటివరకు స్పందించలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos