
పులివెందుల: వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో తన ప్రమేయం ఉన్నట్లు వీసమెత్తు తేలినా పులివెందుల నడి బొడ్డున ఉరి తీయాలని ఆ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఇక్కడ ఆయన మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. ఎక్కడ ఏ ఘటన జరిగినా దాన్ని వైకాపా నేతలు రాజకీయ లబ్ధికి వినియోగించుకోవటం దారుణమని వ్యాఖ్యానించారు. పులివెందు లలో జరిగిన అన్ని ఘటనలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని సవాలు విసిరారు ‘వివేకా నంద రెడ్డి హత్యకు గురయినట్లు ఆ రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో తెలిసిన వెంటనే ఆయన ప్రచారన్ని నిలిపివేశాం. వివేకానంద రెడ్డిని హత్యతో చంద్రబాబు, లోకేశ్, ఆదినారాయణ రెడ్డి, సతీశ్ రెడ్డికి సంబంధం ఉంద’ని ఆ రోజు రాత్రి 11 గంటల పుడు కమలాపురం విధాన సభ సభ్యుడు రవీంద్ర నాథ్ రెడ్డి రాజకీయ ఆరోపణలు చేశారని దుయ్యబట్టారు. ‘మాకూ కుటుంబాలు ఉంటాయి. ఈ ఆరోపణలతో మా కుటుంబాలు క్షోభిస్తున్నాయి. దయ చేసి సంయమనాన్ని పాటించండి.తన తండ్రి హత్య విషయంలో సునీత చెప్పినవన్నీ సరైనవే. చని పోయిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదు. అందుకే ఆయన చనిపోయిన రోజు నుంచి ఇప్పటి వరకూ మేం ఒక్క వ్యతిరేఖ వ్యాఖ్య కూడా చేయ లేద’ని సతీశ్ రెడ్డి పేర్కొన్నారు.