రూ.10కోట్ల జరిమానా చెల్లించిన శశికళ

రూ.10కోట్ల జరిమానా చెల్లించిన శశికళ

బెంగళూరు : అక్రమార్జన నేరానికి సుప్రీం కోర్టు విధించిన రూ.10 కోట్ల జరిమానాను అన్నాడీఎంకే మాజీ కార్యదర్శి, తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ చెల్లించారు. ప్రస్తుతం ఇక్కడి పరప్పన అగ్రహార చెరసాల్లో బంధీగా ఉన్నారు. ఈ మొత్తాన్ని ఇక్కడి సిటీ సివిల్ కోర్టు కార్యాలయంలో డిమాండ్ డ్రాఫ్టుల ద్వారా ఆమె న్యాయవాదులు చెల్లించారు. ఈ మొత్తాన్ని ఓ రాజకీయ నేత ఏర్పాటు చేసినట్లు సమాచారం. అక్రమార్జన నేరానికి శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 వరకూ ఆమె జైలుశిక్ష అనుభవించాల్సి ఉన్నా సత్ప్రవర్తన తదితర కారణాల వల్లే జనవరి 27న ఆమెను విడుదలయ్యే అవకాశం ఉందని కర్నాటక కారాగార శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. శశికళతో పాటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత కూడా నేరగత్తె. జయలలితకు రూ.100 కోట్లు, శశికళ సహా ఇతరులకు రూ.10 కోట్లు జరిమానా విధిస్తూ 2014 సెప్టెంబర్లో న్యాయస్థానం తీర్పునిచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos