నమ్మక ద్రోహులకూ ‘మేలు’ జరగాలి

నమ్మక ద్రోహులకూ ‘మేలు’ జరగాలి

ముంబై : శాసనసభ ఎన్నికల ముంగిట ఎన్సీపీ నుంచి భాజపా శివ సేనల్లోకి ఫిరాయిస్తున్న నేతలపై శరద్ పవార్ గురు వారం విరుచుకు పడ్డారు. ‘విశ్వాస ఘాతకుల్లారా మీకు శుభా కాంక్షలు’ అని మండి పడ్డారు. ఇలాంటి వ్యవహారాలను ఎలా నడపాలో తనకు బాగా తెలుసన్నారు. పార్టీలోనే కొనసాగుతూ పక్క చూపులు చూస్తున్న వారికీ ‘మేలు’ జరగాలని పవార్ ఆకాంక్షించారు. ‘రాజకీయాల్లో ఇలాంటి సమస్యలు తలెత్తు తూనే ఉంటాయి. రాజకీయ అనుభవంతో వాటిని సర్దుబాటు చేస్తాన’ని దీమా వ్యక్తం చేశారు.‘ ఎమ్మెల్యే శివేంద్ర సింగ్ భోంస్లే భాజపాలో చేరారు. దీని ప్రభావం మా పార్టీ పై ఎంత మాత్రమూ ఉండదు. సతారా సీటును తిరిగి మేమే గెలుచుకుంటామ’ని పేర్కొన్నారు. సతారా నుంచి పోటీకి ముగ్గురు ముందుకు వచ్చారని చెప్పారు. ఎవరిని బరిలోకి దించాలో ఇంకా నిర్ణయించుకో లేదన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos