ఎన్నికల బరికి పవార్ దూరం

ఎన్నికల బరికి  పవార్ దూరం

ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ లోక్‌సభ ఎన్నికల బరికి దూరం కానున్నారు. ‘నేను ఎన్నికల్లో పోటీకి దిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మా కుటుంబ సభ్యులు  ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.  అందువల్ల పోటీకి దూరంగా ఉండటానికి ఇదే సరైన తరుణంగా భావిస్తున్నాన’ని సోమవారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధుల సమావేశంలో పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఆయన ఎన్నికల్లో పద్నాల్గు సార్లు పోటీ చేసారు. మూడుసార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. కేంద్రంలో రక్షణ, వ్యవసాయ శాఖల మంత్రిగా వ్యవహరించారు.  2017లో  కేంద్రం ఆయన్ను ‘పద్మ విభూషణ్‌’ పురస్కారంతో సత్కరించింది.  పవార్ కుమార్తె సుప్రియా సూలె, మేనల్లుడు అజిత్ పవార్‌లు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌‌సీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. 48 లోక్‌సభ స్థానాల్లో 40 స్థానాల కేటాయింపు పై  అవగాహన కుదిరింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos