ముగ్గురూ ఒకే చిత్రంలో?

  • In Film
  • October 10, 2019
  • 175 Views
ముగ్గురూ ఒకే చిత్రంలో?

చాలా కాలంగా సరైన విజయం లేక ఒక్క హిట్టు కోసం ఎదురు చూస్తున్న మంచు విష్ణు ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్టు కొట్టాలని కృతనిశ్చయంతో ఉన్నాడు.అందులో భాగంగా కొన్నేళ్ల క్రితం దేశంలో చోటుచేసుకొన్న ఓ భారీ కుంభకోణం నేపథ్యంగా ఆంగ్ల, తెలుగు భాషల్లో ఓ ప్రాజెక్ట్కు భారీ ప్రణాళికను మంచు విష్ణు రచించారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సెట్‌లోకి సంజయ్ దత్ రావడంతో అందరూ షాక్ అయ్యారు.హైదరాబాద్ పరిసరాల్లో కేజీఎఫ్ 2 చిత్రీకరణలో పాల్గొన్న సంజయ దత్ మంచు విష్ణు సినిమా షూట్ కూడా అదే ప్రాంతంలో జరగడంతో సంజయ్ దత్ సెట్స్ను సందర్శించారు. అలాగే తన మిత్రుడు సునీల్ శెట్టి కూడా ఉండటం సంజయ్ రాకకు ఓ కారణం కావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.అంతేకాకుండా సంజయ్ దత్ ఈ ప్రాజెక్టులో భాగమైనట్టు కూడా ఓ వార్త వైరల్ అయింది. అయితే ఈ విషయంపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ చిత్రంలో సునీల్ శెట్టి కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ ముగ్గురి కలయిక సందర్భంగా పలు విషయాలను చర్చించుకొన్నట్టు సమాచారం.జెఫరీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మార్ ఎంటర్టైన్మెంట్ -AVA ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos