సంజయ్ మంజ్రేకర్
ఢిల్లీ : ఆస్ట్రేలియాతో టీమిండియా వన్డే
సిరీస్ ఓడిపోవడానికి మిడిల్ ఆర్డర్ వైఫల్యమే ప్రధాన కారణమని మాజీ క్రికెటర్, క్రికెట్
వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర అభిప్రాయపడ్డాడు. యువ క్రికెటర్లు రిషభ్ పంత్, విజయ్
శంకర్‌లు వైఫల్యం చెందడం కూడా సిరీస్ ఓటమికి మరో కారణమని చెప్పాడు. ప్రపంపచ కప్పు
నాటికి భారత జట్టు మిడిల్ ఆర్డర్‌ను పటిష్టం చేసుకోకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని
హెచ్చరించాడు. విజయ్ శంకర్, పంత్‌లు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారని
విమర్శించాడు. స్ట్రైక్ రేట్‌ను పెంచుకోవాలంటే కోహ్లీ లాగా గ్రౌండ్ షాట్లు కొట్టినా
చాలు, అన్నిటినీ గాల్లోకి లేపాల్సిన అవసరం లేదు….అని చెప్పాడు. ఈ సిరీస్ గెలవడానికి
ఆసీస్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని, వారు భారత్‌లో ఏం చేయాలనుకున్నారో, అది చేసి చూపారని
తెలిపాడు.