ఏపార్టీ భవన్‌లో ఉంటానో ఫలితాల తరువాత తేలుతుంది..

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొద్ది రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌కు తలనొప్పిగా పరిణమించాయి.రోజుకో ట్విస్ట్‌ ఇస్తూ జగ్గారెడ్డి కాంగ్రెస్‌ నేతలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు.తెరాస అధినేత కేసీఆర్‌,వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌లు యూపీఏలో కలవడానికి సిద్ధంగా ఉన్నారని,కాంగ్రెస్‌లో కోవర్టులు ఉన్నారని ఇలా రోజుకో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుండడం కాంగ్రెస్‌ నేతలను అయోమయానికి గురి చేస్తోంది.తాజాగా జగ్గారెడ్డి మరోసారి అటువంటి వ్యాఖ్యలే చేశారు. కేసీఆర్ , కేటీఆర్ బంధువులు టీఆర్ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నారని మే 25 నుంచి 30వ తేదీ లోపు తాను గాంధీభవన్‌లో ఉంటానో.. టీఆర్ఎస్ భవన్‌లో ఉంటానో లోక్‌సభ ఎన్నికల తరువాత తేలిపోతుందన్నారు.అప్పుడే కేసీఆర్ బంధువులకు తన నిర్ణయం చెబుతానన్నారు.యూపీఏ ప్రభుత్వం వస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ సేఫ్ జోన్‌లో ఉంటుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నా పార్టీ చెప్పింది సగమే వింటానని, మిగతా సగమంతా తన నిర్ణయాలేనని తెలిపారు.తాను స్వశక్తిగా ఎదిగానని.. పార్టీ బ్యానర్‌పై గెలిచిన నేతను కానన్నారు. రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ దెబ్బతిందని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos