ఇంటివాడైన సందీప్ శర్మ

  • In Sports
  • August 20, 2021
  • 130 Views
ఇంటివాడైన సందీప్ శర్మ

ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ సందీప్ శర్మ ఒక ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు తాషా సాత్విక్ ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వృత్తిరీత్యా తాషా ఫ్యాషన్, నగల డిజైనర్ గా పని చేస్తున్నారు. 2018లోనే వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. అయితే, కరోనా వల్ల పెళ్లి వాయిదా పడింది. నవ దంపతులు సందీప్, తాషాలకు సన్ రైజర్స్ హైదరాబాద్ శుభాకాంక్షలు తెలిపింది. సన్ రైజర్స్‌కు పెళ్లి కళ వచ్చిందని చమత్కరిస్తూ ట్వీట్ చేసింది. మిస్టర్ అండ్ మిసెస్ సందీప్ శర్మ… మీ దాంపత్య జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నామని తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos