‘గుజరాత్‌లో జర్నలిస్టు అరెస్టు చేయలేదా?’

‘గుజరాత్‌లో జర్నలిస్టు అరెస్టు చేయలేదా?’

ముంబై: రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి అరెస్టును ‘బ్లాక్ డే’ గా అభివర్ణించిన భాజపా నేతలపై శివసేన మండిపడింది. శివసేన అధికార పత్రిక సామ్నా గురువారం సంపాదకీయంలో కమలనాధుల్ని దునుమాడింది. ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛపై దాడి, అత్యవసర పరిస్థితులు అంటున్న పలువురు కేంద్ర మంత్రుల వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని ఎద్దేవా చేసింది. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను, హత్యలను ప్రస్తావించింది. మహారాష్ట్ర ప్రభుత్వంలో మీడియాపై దాడి అనే ప్రశ్నే లేదని, ఇలా అరోపిస్తున్నా వారే ప్రజాస్వామ్యంీ మొదటి స్థంభ మైన శాసనసభను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండి పడింది. గోస్వామిని రక్షించడానికే గత రాష్ట్ర ప్రభుత్వం నాయక్ ఆత్మ హత్య కేసును కప్పిపుచ్చిందని ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు గుజరాత్లో ఒక జర్నలిస్టును అరెస్టు చేశారు, యూపీలో జర్నలిస్టులు హత్యకు గురవుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక అమాయక వ్యక్తి తన వృద్ధాప్య తల్లితో పాటు ఆత్మహత్య చేసు కున్నా డు. అతని భార్య న్యాయం కోసం పోరాడుతోంది. భాజపా నాయకులు బాధిత నాయక్ కుటుంబానికి న్యాయం కోసం డిమాండ్ చేయాలని సూచిం చిం ది. ప్రధాని తో సహా అందరూ చట్టం ముందు సమానమేనని వ్యాఖ్యానించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos