ట్రంప్ ఓటమి నుంచి మోదీ పాఠాలు నేర్చుకోవాలి

ట్రంప్ ఓటమి నుంచి మోదీ పాఠాలు నేర్చుకోవాలి

ముంబై: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి నుంచి భారత్ నేర్చుకోవాల్సి ఉందని శివసేన అధికార పత్రిక- సామ్నా సంపాదకీయం సోమవారం ప్రధాని మోదీని హెచ్చరించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలను బీహార్ ఎన్నికలతో పొల్చి మోడీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేసింది. ‘అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చొనేందుకు ట్రంప్కు ఎటువంటి అర్హతా లేదు. అమెరికా ప్రజలు ట్రంప్ను గెలిపించి తాము చేసిన తప్పును నాలుగేళ్లలోనే సరిచేసుకున్నారు. ఇచ్చిన వాగ్ధానాల్లో ఒక్కటి కూడా ట్రంప్ అమలు చేయలేదు. ట్రంప్ ఓటమి నుంచి మోదీ పాఠాలు తీసుకుంటే చాలా మంచిది. అమెరికాలో ఇప్పటికే అధికారం మారింది. బీహార్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. నితీష్కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఓడిపోబోతోంది. ప్రజలకు భ్రమలు తొలిగి నేతలను అధికారం నుంచి దించుతున్నారు. ఓటమిని అంగీకరించని ట్రంప్ అర్ధంపర్ధం లేకుండా ఓటింగ్లో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారు. భారత దేశంలో ట్రంప్కు ఎటవంటి ఘనమైన స్వాగతం లభించిందో మనం చూశాం. ఒక తప్పుడు మనిషికి ఆవిధంగా ఆహ్వానం పలకడం భారతీయ సంస్కృతి కాదు. కానీ అది జరిగింది. భారత సంతతికి చెందిన కమలా హారీస్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైంది. ట్రంప్ ఆమెను చాలా అవమానించారు. ఆమె విజయాలను వెక్కిరించారు. అటువంటి వ్యక్తికి భారత ప్రధాని మోడీ, బిజెపి మద్దతు తెలిపారు. నమస్తే ట్రంప్ను ఎంత వైభవంగా జరిపామన్నది ముఖ్యమైన విషయం కాదు. అమెరికా ప్రజలు తమ తప్పును దిద్దుకున్నారు. ట్రంప్కు బై బై చెప్పార’ని విశ్లేషించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos