ముంబై : శివసేన భవనం కూల్చేయాలని బీజేపీ నేత ప్రసాద్ లాడ్ చేసిన వ్యాఖ్యల పై శివసేన పార్టీ మండిపడింది. బీజేపీ నేతల తీరు వల్ల ఆ పార్టీ భవిష్యత్తులో కనుమ రుగయ్యే పరిస్థితి కనపడుతోందని సామ్నా పత్రిక సోమవారం వ్యాఖ్యానించింది. తమ పార్టీతో కొందరికి రాజకీయ పరంగా విభేదాలు ఉండొచ్చని, అలాగే తమ పార్టీని విమర్శిం చవచ్చని, అంతమాత్రాన ఇలా శివసేన భవనాన్ని కూల్చేయాలని మాత్రం ఇప్పటివరకు ఎవరూ అనలేదని విమర్శించింది. ‘బాలా సాహెబ్ థాకరేతో పాటు ఛత్ర పతి శివాజీ కొలువై వున్న భవనమది. కాషాయ ధ్వజం సైతం అందులో ఎగురుతుంటుంది. బీజేపీలో ఒకప్పుడు విధేయులైన కార్యకర్తలు ఉండేవారు. ఇప్పుడు మాత్రం బీజేపీ మారిపోయింది. నిజమైన సైద్ధాంతిక విలువలున్న నేతలు ఇప్పుడు ఆ పార్టీలో లేర’ని దుయ్యబట్టింది.